చిన్నారులకు యూనిఫాంల పంపిణీ..

బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : బెల్లంపల్లి పట్టణంలోని 15వ వార్డు టేకులబస్తీ అంగన్‌వాడీ కేంద్రాన్ని గురువారం స్థానిక కౌన్సిలర్ చింతల వసంత సందర్శించారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆదేశాల మేరకు కేంద్రంలోని సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ వసంతను అంగన్‌వాడీ టీచర్ పద్మ శాలువాతో సన్మానించారు. అనంతరం చిన్నారులకు నూతన యూనిఫాంలను అంగన్‌వాడీ టీచర్ పద్మతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా చిన్నారులతో పాటు వార్డులోని గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారాన్ని పంపిణీ చేశారు. రానున్న వేసవి దృష్ట్యా పిల్లలు, గర్భిణీల ఆరోగ్య విషయమై అప్రమత్తంగా ఉండాలని అంగన్‌వాడీ సూపర్వైజర్లు, టీచర్లకు సూచించారు. ప్రభుత్వ సేవలపై లబ్ధిదారులకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు కాంగ్రెస్ నాయకులు, అంగన్‌వాడీ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply