వాయిద్య పరికరాల పంపిణీ

వాయిద్య పరికరాల పంపిణీ
హైదరాబాద్, ఆంధ్రప్రభ : కరీంనగర్ జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సంగీతంలో శిక్షణ(training) పొందుతున్నఅంధ విద్యార్థులకు సర్కార్ చేయూతనిచ్చింది. ఈ రోజు జూబ్లీహిల్స్‌లోని నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వారికి వాయిద్య పరికరాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ పాల్గొన్నారు.
అనంతరం సీఎం రేవంత్ రెడ్డికి(CM Revanth Reddy) విద్యార్థులు లైవ్‌లో పాట పాడి వినిపించారు. ఆ తర్వాత వారు పాడిన పాటల సీడీని సీఎంతో పాటు మంత్రులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, జీహెచ్ఎంసీ(GHMC) మేయర్ విజయలక్ష్మి, సీఎం ఓఎస్‌డీ వేముల శ్రీనివాస్, కరీంనగర్ జిల్లా(Karimnagar district) కలెక్టర్ పమేలా సత్పతి పాల్గొన్నారు.
