వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరికీ గాయాలు

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరికీ గాయాలు

కల్లూరు సాయిబాబా టెంపుల్ సమీపంలో రోడ్డు ప్రమాదంలో గాయాలపాలైన రాజేందర్ రెడ్డి

కుంటాల, ఆంధ్రప్రభ : మండలంలోని కల్లూరు లోని మంగళవారం వేరువేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరికీ తీవ్రగాయాలైన సంఘటన చోటుచేసుకుంది వివరాల్లోకి వెళితే కల్లూరు గ్రామానికి చెందిన రాజేందర్ రెడ్డి అనే వ్యక్తి కల్లూరు లోనే గల ఒక షాపు నుండి కల్లూరు కి ఇంటికి వెళ్తుండగా అదుపుతప్పి బైక్ సిమెంటు స్తంభానికి ఢీకొనగా ఆయన తల తో పాటు మెడకు తీవ్రగాయాలు అయ్యాయి దీంతో వెంటనే గమనించిన స్థానికులు బైంసా ఏరియా ఆసుపత్రికి స్థానిక అంబులెన్స్ లో తరలించారు.

అయితే మెరుగైన వైద్యం కోసం నిర్మల్ ప్రైవేటు ఆసుపత్రికి మెరుగైన వైద్యం కోసం తరలించినట్టు పేర్కొన్నారు బలమైన గాయాలు కావడంతో పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు అంతేకాకుండా 61 వ జాతీయ బైంసా నిర్మల్ రహదారిపై గల కల్లూరు బ్రిడ్జి సమీపంలో బైంసా మండలం తిమ్మాపూర్ గ్రామం చెందిన బాబు అనే వ్యక్తికి సైతం బైక్ అదుపుతప్పి పడడంతో ఆయన కూడా తీవ్ర గాయాలు అయ్యాయి ఆయనను బైంసా లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. దీంతో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉన్నట్టు స్థానికులు పేర్కొంటున్నారు.

Leave a Reply