Hot Comments | 78 వేల ఏళ్లకూ మిల్లీమీట‌ర్ భూమి ద‌క్క‌దు – పాకిస్తాన్ కు గ‌వాస్క‌ర్ చుర‌క‌లు

బెంగ‌ళూరు -ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడి బాధిత కుటుంబాల‌కు సంతాపం తెలిపారు భార‌త మాజీ క్రికెట‌ర్ సునీల్ గ‌వాస్క‌ర్. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ కొన్ని అభిప్రాయాలు వ్య‌క్తం చేశారు. భార‌తీయుల‌పై ఆ ఘ‌ట‌న తీవ్ర ప్ర‌భావం చూపింద‌న్నారు. దాడికి పాల్ప‌డిన కుట్ర‌దారుల్ని, ఉగ్ర‌వాదుల‌కు మ‌ద్ద‌తు ఇస్తున్న వారిని కూడా ఆయ‌న ఈ సంద‌ర్భంగా ఓ ప్ర‌శ్న వేశారు. ఇదంతా ఏం సాధించ‌డానికి చేస్తున్నారని గ‌వాస్క‌ర్ ప్ర‌శ్నించారు. గ‌త 78 ఏళ్ల‌లో ఒక్క మిల్లీమీట‌ర్‌ భూమి కూడా మార‌లేద‌ని, అంటే రాబోయే 78 వేల ఏళ్ల‌కు కూడా ఎటువంటి మార్పు ఉండ‌బోద‌ని పాక్‌కు ప‌రోక్షంగా చుర‌క‌లంటించారు. మ‌రి అలాంట‌ప్పుడు శాంతియుతంగా ఎందుకు జీవించ‌డం లేద‌ని గ‌వాస్క‌ర్ ప్ర‌శ్నించారు. దేశాన్ని ఎందుకు బ‌లోపేతం చేయ‌డం లేద‌ని అడిగారు.

Leave a Reply