ఎమ్మెల్యేను కలిసిన పశ్చిమ తహసీల్దార్ రిబ్కా రాణి

ఎమ్మెల్యేను కలిసిన పశ్చిమ తహసీల్దార్ రిబ్కా రాణి

భవానిపురం, ఆంధ్రప్రభ : విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరిని విజయవాడ పశ్చిమ తహసీల్దార్ రిబ్కా రాణి ఆదివారం మర్యాదపూర్వం కలిసి జ్ఞాపికను అందజేశారు.ఈ సందర్భంగా జనాభా లెక్కల సేకరణ కొరకు కొన్ని సూచనలు స్వీకరించారు. 2020,21 సంవత్సరంలో జరగాల్సిన భారత దేశ జనాభా గణన కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ క్రమంలో ఈ సంవత్సరం మొదలైన భారత దేశ జనాభా లెక్కల సేకరణలో భాగంగా 2026-మే-1 నుండి జాబితా సేకరణను ప్రభుత్వం ప్రారంభిస్తుంది.

దీనిలో భాగంగా ఏప్రిల్ ఆఖరిలోపు డిజిటల్ డేటా సేకరణ మొదటి దశ కొనసాగుతోంది(సెల్ఫ్ ఎన్యుమరేషన్ వెబ్సైట్లోకి వెళ్లి వారి వివరాలను నమోదు చేయాల్సిన పక్రియ) .వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణ కేంద్రమైన ఈ నగరంలో 2011 నాటికి 10 లక్షలకు పైగా జనాభా ఉండగా, 2024 నాటికి ఈ మహానగర జనాభా గణనీయంగా పెరుగుతుందని అంచనాలు సూచిస్తున్నాయి. ప్రజల భాగస్వామ్యం ద్వారా కచ్చితమైన సమాచారాన్ని సేకరించే లక్ష్యంతో విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజునా చౌదరిని విజయవాడ పశ్చిమ తహసీల్దార్ రిబకా రాణి మర్యాదపూర్వకంగా కలసారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి తగిన మార్గ దర్శకాలు రూపకల్పన చేయు దిశగా ముందుకు వెళుతూ రెవిన్యూ సిబ్బంది సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ సుచించారు.కార్యక్రమం విజయ వంతంగా పూర్తి చేయాలనీ ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply