ధనురాభి గ్రామంలో మొక్కల నాటే కార్యక్రమం.. పర్యావరణ పరిరక్షణకు పిలుపు
ధనురాభి గ్రామంలో మొక్కల నాటే కార్యక్రమం.. పర్యావరణ పరిరక్షణకు పిలుపు
ఆంధ్రప్రభ, ఇంద్రవెల్లి: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల పరిధిలోని ధనురాభి గ్రామంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ప్రగతి పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గ్రామంలో వివిధ రకాల మొక్కలను నాటారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ జమునా నాయక్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలను సంరక్షించి పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో డీఆర్ఓ నరేష్, క్షేత్ర ఎఫ్బీఓ ప్రవీణ్, ఎఫ్బీఓ జంగు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
