Price-13.5-lakh : ..హ్యూమనాయుడో ..Andhr5a Prabha Top Story

Price-13.5-lakh : ..హ్యూమనాయుడో ..Andhr5a Prabha Top Story

  • ఈ బాహుబలి బహు చౌక
  • రేటు ₹ 13.5 లక్షలే
  • ప్యూచర్​ సృష్టికర్త వీడే
  • గ్లోబల్ రోబోటిక్స్ లో చైనా విప్లవం
  • హ్యూమనాయిడ్​ రోబో తయారీలో …
  • అగ్రగామి చైనా
  • కృత్రిమ మేథ కోసం అమెరికాతో పోటీ

( ఆంధ్రప్రభ, న్యూస్​ నెట్​ వర్క్​ )

సృష్టికి ప్రతిసృష్టి చేయు విశ్వామిత్రుడు నరుడె
జీవకోటి సర్వంలొ శ్రెస్టతముడు మానవుడే అని అభ్యుదయ కవి ఆరోరుద్రుడు.. సినీ కవి ఆరుద్ర 54 ఏళ్ల కిందట భాలభారతం సినిమాకు రాసిన పాటలో.. సృష్టి, ప్రతిసృష్టిని ప్రస్తావించారు.

Price-13.5-lakh

సృష్టి మూలం దైవం.. కానీ ఆ దైవం మాత్రమే చేయగలిగే పనిని మానవుడు కూడా చేయగలడని.. ఆయన ప్రస్తావించారు. నిజమే.. ఇప్పు ఈ కాలగమనం కాంతి వేగంతో దూసుకు పోతోంది. భగవంతుడు మనిషిని సృష్టిస్తే.. ఇప్పుడు మనిషి సృజనాత్మ్క మదిలో ఉద్భవించిన రోబో.. హుమనాయిడ్​ రోబో,,, రాబోయే తరంలో మనిషిని సృష్టించే స్తాయికి ఎదుగుతుందంటే.. నమ్మలేని నిజం కాదు.. పచ్చి నిజం. ఇది భవిష్యవాణి కావొచ్చు.. ఎందుకంటే..తాజాగా ప్రపంచంలో హ్యూమనాయిడ్​ రోబోలు అసంఖ్యాకంగా పెరుగుతున్నాయి. నిముషాల్లో వందలు కాదు.. వేల సంఖ్యలో ఉద్భవిస్తున్నాయి. వీటిని ఉత్పత్తి చేసి… మార్కెట్​ లో ఆధిపత్యం కోసం అగ్ర రాజ్యాలు పోటీ పడుతున్నాయి. ఇందులో అమెరికా, చైనా నువ్వానేనా అనే రీతిలో దూసుకు పోతున్నాయి.

Price-13.5-lakh

ప్రపంచంలో తయారవుతున్న హ్యూమనాయిడ్ రోబోలలో (మానవరూప రోబోలు) చైనా దాదాపు 85% మార్కెట్ వాటాను సొంతం చేసుకుంది. ఈ రంగంలో తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయిస్తోంది. చైనా కంపెనీలు Unitree Robotics , AGIBOT అగ్రగామి స్టార్టప్‌లు ఈ భారీ విజయానికి ప్రధాన భూమిక పోషిస్తున్నాయి,

ఈ గ్లోబల్ రోబోటిక్స్ విప్లవం రోజు రోజుకూ కీలక మలుపు తిరుగుతోంది. ఇందులో చైనా వ్యూహాత్మక పరుగులో దూసుకు పోతోంది. చైనా ఆధిపత్యానికి ప్రధాన కారణం.. నమ్మలేనంత తక్కువ ధర కే హ్యూమనాయిడ్​ రోబోను చైనా అందిస్తోంది, అమెరికాకు చెందిన టెస్లా ‘ఆప్టిమస్’ లేదా బోస్టన్ డైనమిక్స్ రోబోల ధరలు రూ. 30 లక్షల నుండి కోట్లలో ఉండగా, చైనా కంపెనీలు వాటిని చాలా తక్కువకే అందిస్తున్నాయి. ఉదాహరణకు, Unitree సంస్థ తీసుకొచ్చిన ‘G1’ హ్యూమనాయిడ్ రోబో బేస్ మోడల్ ధర కేవలం $16,000 (సుమారు రూ. 13.5 లక్షలు) మాత్రమే.

Price-13.5-lakh : లక్ష రోబోలే తాజా టార్గెట్​

Price-13.5-lakh

రోబోల తయారీకి అవసరమైన అరుదైన అయస్కాంత ఖనిజాలు (Rare Earths) 90% పైగా చైనాలోనే శుద్ధి చేస్తారు, బ్యాటరీలు, మోటార్లు (Actuators), హార్డ్‌వేర్ విడి భాగాలన్నీ దేశీయంగానే లభిస్తుండటంతో తయారీ ఖర్చు భారీగా తగ్గింది. ఈ రంగానికి చైనా ప్రభుత్వం బిలియన్ల డాలర్ల సబ్సిడీలను ఇస్తోంది. అలీబాబా, టెన్సెంట్ వంటి చైనా దిగ్గజ టెక్ కంపెనీలు ఈ స్టార్టప్‌లలో భారీగా పెట్టుబడులు పెట్టాయి. 2027 నాటికి 1,00,000 హ్యూమనాయిడ్ రోబోలను వినియోగంలోకి తేవాలని బీజింగ్ లక్ష్యంగా పెట్టుకుంది . Unitree Robotics ఇది ప్రపంచంలోనే అత్యధికంగా హ్యూమనాయిడ్ రోబోలను విక్రయిస్తున్న సంస్థ. వీటి H1 , G1 రోబోలు పరిగెత్తడం, బ్యాక్‌ఫ్లిప్స్ (వెనక్కి పల్టీలు) కొట్టడం, చైనీస్ మార్షల్ ఆర్ట్స్ (కుంగ్ ఫూ) ప్రదర్శించడంలో రికార్డులు సృష్టించాయి. ప్రస్తుతం ఈ కంపెనీ షాంఘై స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో దాదాపు $6 బిలియన్ల నుండి $7 బిలియన్ల విలువతో ఐపీఓ (IPO) కి సిద్ధమవుతోంది.

Price-13.5-lakh : ప్రస్తుతం మనిషితో కలసి.. పని

Price-13.5-lakh

AGIBOT: ఈ సంస్థ పారిశ్రామిక స్థిరత్వం సాంకేతిక నైపుణ్యానికి ప్రాధాన్యత ఇస్తుంది. వీరి రోబోలు ఈవీ (EV) కార్ల తయారీ కర్మాగారాల్లో స్మార్ట్‌ఫోన్ అసెంబ్లీ లైన్లలో మనుషులతో కలిసి విజయవంతంగా పనిచేస్తున్నాయి. ఇటీవల చైనాకు చెందిన uniX AI అనే కంపెనీ ‘పాంథర్’ (Panther) అనే గృహ వినియోగ రోబోను పరిచయం చేసింది. ఇది ఉదయం నిద్రలేపడం, బ్రెక్‌ఫాస్ట్ చేయడం, ఇల్లు ఊడవడం వంటి పనులను సింగిల్ ఛార్జ్‌తో 16 గంటల పాటు నాన్‌స్టాప్‌గా చేయగలదు.

Price-13.5-lakh : ఈ సవాళ్లు మామూలే

Price-13.5-lakh

‘బాడీ’ ఉంది.. కానీ ‘బ్రెయిన్’? లేదు. చైనా రోబోల బాహ్య శరీరాన్ని (Hardware Body) తక్కువ ధరకే నిర్మించడంలో రేసును గెలిచినప్పటికీ, వాటికి ఎదురవుతున్న అతిపెద్ద సమస్య “ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)”.నిజమైన పనుల కొరత ఏర్పడుతోంది. ప్రస్తుతం ఫ్యాక్టరీలలో పూర్తిస్థాయి పనులు చేయడానికి ఈ రోబోలు ఇంకా వంద శాతం సిద్ధం కాలేదు. అందుకే చైనాలో తయారవుతున్న వేలాది రోబోలలో చాలావరకు కేవలం హోటల్ లాబీలు, కాఫీ షాపులు, ప్రదర్శనలలో (Exhibitions) కేవలం ఆకర్షణగా మాత్రమే మిగిలిపోతున్నాయి.

Price-13.5-lakh : కృత్రిమ మేథస్సు కోసం

Price-13.5-lakh

రోబోల ఆలోచనా శక్తి (AI Brain) సాఫ్ట్‌వేర్ విషయంలో అమెరికా ఇప్పటికీ ముందంజలో ఉంది. ఈ లోటును భర్తీ చేయడానికి చైనా ప్రస్తుతం $295 బిలియన్ల భారీ బడ్జెట్‌ను కేటాయించి, రోబోలకు స్వయంగా ఆలోచించే ‘మెదడును’ (AI Infrastructure) అభివృద్ధి చేస్తోంది. ఉదాహరణకు, Unitree తన రోబోల ఆలోచనా సామర్థ్యం కోసం ప్రముఖ చిప్ తయారీ సంస్థ NVIDIA తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. మొత్తంగా చెప్పాలంటే, హార్డ్‌వేర్ భారీ ఉత్పత్తి (Mass Production) పరంగా చైనా ప్రపంచ దేశాల కంటే చాలా ముందుంది. అయితే, ఈ ‘హ్యూమనాయిడ్ రోబోల బబుల్’ పేలిపోకుండా ఉండాలంటే, అవి కేవలం ప్రదర్శన వస్తువులుగా కాకుండా, పరిశ్రమలలో మనుషుల స్థానాన్ని భర్తీ చేసే స్థాయి తెలివితేటలను (AI) త్వరగా అందుకోవాల్సి ఉంటుంది

ALSO READ : 2-injured-us-iran-conflict : అమెరికా దూకుడు Andhra Prabha Top Story

Leave a Reply