మచిలీపట్నంలో ఆశా వర్కర్ ఆత్మహత్యాయత్నం..

మచిలీపట్నం, ఆంధ్రప్రభ : జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో ఓ ఆశా వర్కర్ ఆత్మహత్యాయత్నం చేసుకుంది. స్థానికులు ఆసుపత్రికి తరలించారు. టీడీపీ నేత వేధింపులే కారణం అంటూ బాధితురాలు ఆవేదన తెలిపింది. ఒంటరిగా ఉంటున్న తనను వార్డు ఇన్చార్జి శ్రీరాములు అనేక విధాలుగా వేధింపులకు గురి చేస్తున్నాడు అంటూ ఆశా వర్కర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె స్థానంలో అతని అనుయాయురాలిని నియమించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాడు అంటూ కన్నీరు పెట్టుకుంది.

వార్డు ఇంచార్జి అనే అధికారం అడ్డుపెట్టుకుని సూటిబోటి మాటలతో అనేక విధాలుగా హింసలకు గురి చేస్తున్నాడు అంటూ కుమిలిపోతుంది. వార్డు ఇన్చార్జి శ్రీరాములు పెట్టే వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ ఆశ వర్కర్ తెలిపారు. తను ప్రాణాలు కోల్పోతే అందుకు 12వ వార్డు ఇన్చార్జి బొమ్మిడి శ్రీరాములే కారణం అంటున్నారు. తన చావుతోనైనా కూటమి నాయకుల వేదింపులు ఇతర సిబ్బందిపై తగ్గాలంటూ వేడుకుంటుంది. శ్రీరాములు వేదింపులు తాళలేక నిద్రమాత్రల మింగి ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు ఆశా వర్కర్ యేసుమణి తెలిపారు.

Leave a Reply