Devotional| ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర – మరికొద్దిసేపట్లో ‘ రంగం ‘

సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో బోనాల జాతర ఘనంగా కొనసాగుతున్నాయి.. దీనిలో భాగంగా నేడు రంగం, అంబారీపై అమ్మవారి ఊరేగింపు ఉంటుంది. రెండోరోజు అమ్మవారి ఆలయంలో బలిపూజ, గావు పట్టడం నిర్వహిస్తారు. అనంతరం మాతాంగేశ్వరి ఆలయం ఎదుట ఓ పచ్చికుండపై స్వర్ణలత(జోగిని) దేశంలో, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, జరగబోయే విషయాలపై భవిష్యవాణి చెప్పనున్నది. ఆ తర్వాత అమ్మవారిని అంబారీపై దేవాలయం చుట్టూ తిప్పి మెట్టుగూడలోని దేవాలయానికి సాగనంపనున్నారు.

Leave a Reply