నూతన పీఓపీని కలిసిన నాలుగో తరగతి ఉద్యోగ సంఘ నాయకులు

నూతన పీఓపీని కలిసిన నాలుగో తరగతి ఉద్యోగ సంఘ నాయకులు

పెండింగ్ వేతనాలు చెల్లించాలని పిఓపి వినతి

ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఐపిడిఏ నూతన ప్రాజెక్ట్ అధికారిగా పదవి బాధ్యతలు చేపట్టిన మంద మకరందకు గురువారం ఆయన చాంబర్లో గిరిజన సంక్షేమ శాఖ తెలంగాణ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కేబీసీ నారాయణ ఆధ్వర్యంలో నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పిఓ కు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పిఒకు వారి సమస్యలు తెలిపారు. గిరిజన సంక్షేమ శాఖ అశ్రమ వసతి గృహాల్లో పనిచేస్తున్న డైలీ వేజ్ పార్ట్ టైం శానిటేషన్ వర్కర్లు 9 నెలల వేతనాలు పెండింగ్ ఉన్నాయని వేతనాలు రాక చాలా చాలా ఇబ్బందులు పడుతున్నాడని కేబిసి నారాయణ నాయకులు పిఓ దృష్టికి తీసుకువెళ్లారు.

నెలలు తరబడి వేతనాలు రాక పిల్లల చదువులు ఫీజులు, హౌస్ రెంట్ కట్టలేక ఎంతో సతమత అవుతున్నారని తెలిపినట్లు కేబీసీ నారాయణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా నూతన పిఓ సానుకూలంగా స్పందించి మీ సమస్యలు పెండింగ్ వేతనాల గురించిసర్ వివరంగా రాసి ఇవ్వండి నేను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి మీకు వేతనాలు వచ్చే ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారని దీంతో నూతన పిఓకు ఉమ్మడి జిల్లా నాలుగవ తరగతి ఉద్యోగుల సంఘం తరఫున కృతజ్ఞతలు తెలిపినట్లు ఆయన పేర్కొన్నారు.

పి ఓ కు కలిసిన వారిలో తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖనాలుగో తరగతి ఉద్యోగుల సంఘంరాష్ట్ర గౌరవ అధ్యక్షులు కే బి సి నారాయణ, అదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు సౌఖాత్ హుస్సేన్, నాయకులు సోనేరావు, మల్లేష్, కృష్ణ, భరత్, రామ్ కిషన్, రవి తదితర ఉద్యోగులు పాల్గొన్నారు. అని పి.బి.సి.నారాయణ తెలిపారు.