18aprileditorial | రాజ్యాంగ సవరణ బిల్లు వీగింది..

18aprileditorial | రాజ్యాంగ సవరణ బిల్లు వీగింది..

18aprileditorial | రాజ్యాంగ సవరణ బిల్లు ఎందుకు విఫలమైంది?
మహిళా రిజర్వేషన్‌పై రాజకీయ వ్యూహాలు
రాహుల్ గాంధీ ఆరోపణలు, ప్రతిపక్షాల వాదనలు
ప్రియాంక గాంధీ ప్రసంగం హైలైట్

లోక్‌సభలో శక్రవారం సాయంత్రం 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంతో మిగిలిన రెండు బిల్లులను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. మహిళల రిజర్వేషన్‌లకు ఏ ఒక్క పార్టీ వ్యతిరేకం కాదు, ఇందుకు సంబంధించిన బిల్లును మిగిలిన రెండింటితో కలపడాన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. దీంతో ప్రజల ఆకాంక్ష నెరవేరింది. లోక్‌సభ నియోజక వర్గాలను 850కి పెంచాలన్న రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది.

18aprileditorial
18aprileditorial

రాజ్యాంగ సవరణ బిల్లు సభ ఆమోదం పొందడానికి మూడింట రెండు వంతల మంది సభ్యుల అవసరం, అంటే 352 మంది సభ్యుల మద్దతు అవసరం. కానీ, 298మంది మాత్రమే ఓటు వేశారు. 230 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. ఈ మ్యాజిక్‌ ఫిగర్‌ని అందుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది. దాంతో ప్రభుత్వం మిగిలిన రెండు బిల్లులను ఉపసంహరించుకుంది. ఈ రెండు బిల్లులను వెనక్కి తీసుకుంటున్నట్టు పార్లమెంటరీ వ్యవహారాల శాఖమంత్రి కిరణ్‌ రిజిజు ప్రకటించగానే, సభను స్పీకర్‌ ఓం బిర్లా శనివారం నాటికి వాయిదా వేశారు.

నిజానికి మహిళా బిల్లును ఎవరు వ్యతిరేకించలేదు. రాజ్యాంగ సవరణ బిల్లును మాత్రమే వ్యతిరేకించారు. రాజ్యాంగ సవరణను దీంతో కలపడం వల్ల అది వీగిపోయింది. మహిళా బిల్లుపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే 2013లో ఆమోదించిన బిల్లును విడిగా తేవాలని కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ డిమాండ్‌ చేశారు. ప్రతిపక్షాలు మహిళా బిల్లును వ్యతిరేకిస్తున్నాయనే అభిప్రాయం కలిగించడం కోసం ప్రభుత్వం వ్యూహాత్మకంగా ఈ మూడు బిల్లులలను కలిపి రాజ్యాంగ సవరణ బిల్లుగా తీసుకుని వచ్చిందని రాహుల్‌ ఆరోపించారు.

రాజ్యాంగ సవరణకు మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరమని ప్రధాని నరేంద్రమోడీకి తెలుసుననీ, ఆయన సభ్యులను పెడతోవ పట్టించేందుకు ఈ విధంగా మూడు బిల్లులను కలిపి తెచ్చారని రాహుల్‌ ఆరోపించారు. ఈ సందర్భంగా తొలిసారి లోక్‌సభలో ఆయన సోదరి, వయనాడ్‌ ఎంపీ ప్రియాంక గాంధీ ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. తాను 20 ఏళ్లుగా సాధించలేనిది తన సోదరి మొదటి ప్రసంగంతోనే ఆకట్టుకుందంటూ ప్రశంసించారు. దాంతో సభలో కాంగ్రెస్‌, మిత్ర పక్షాల సభ్యులు కరతాళ ధ్వనులు చేశారు. ఆమె తన ప్రసంగంలో నవ్వులు పూయించారు.

తన ముత్తాత మోతీలాల్‌ నెహ్రూ పేరు ప్రస్తావించి అందరినీ ఆకట్టుకున్నారు. ఇది లోక్‌సభ చరిత్రలో చారిత్రాత్మకమైన రోజు అన్న రాహుల్‌ మాటల్లో అణు మాత్రం అతిశయోక్తి లేదు. ప్రపంచ దేశాలు భారత దేశాన్ని ఎంతో గౌరవిస్తున్నాయంటే మహిళలకు అత్యున్నతమైన గౌరవం ఇవ్వడం వల్లనే. అలనాడు ప్రధాని ఇందిరా గాంధీ తన ధీరోదాత్తత ద్వారా, నిర్ద్వంద్వ వైఖరి ద్వారా మహిళలకు భారత్‌ ఎంత గౌరవం ఇస్తోందో నిరూపించారు. ఆమె జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో చేసిన ప్రసంగాలు భారత చరిత్రను స్వర్ణాక్షరాలతో లిఖించాయి.

మహిళలకు రిజర్వేషన్లు కల్పించడానికే కాదు, మహిళలకు సమున్నతమైన గౌరవం ఇవ్వడానికి భారత్‌ వ్యతిరేకం కాదు అని నిరూపించారు ఆమె.

Leave a Reply