ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతుల్లో జాప్యం..
- విద్యుత్ లేక పంటలు ఎండుముఖం..
- స్పందించాలని రైతుల విజ్ఞప్తి
గొల్లపల్లి, ఆంధ్రప్రభ : ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి నెలరోజులు దాటినా దాన్ని మరమ్మతు చేయాల్సిన విద్యుత్ సిబ్బంది పట్టించుకోకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. గత మూడు నెలలుగా ట్రాన్స్ఫార్మర్ ఇబ్బంది పెడుతున్న సిబ్బంది మాత్రం దాన్ని మార్చడంలో వివక్ష చూపుతున్నారు. వేరసి ట్రాన్స్ఫార్మర్ మీద ఆధారపడ్డ రైతులు ఇబ్బందులు పడుతున్నారు. గొల్లపల్లి మండలం చిలువకోడూరు గ్రామంలోని ఎస్ ఎస్ 17 నెంబర్ గల 100 కేవి ట్రాన్స్ఫార్మర్ కాలిపోయింది.
అబ్బాపూర్ రోడ్డు కానుకొని ఉన్న ట్రాన్స్ఫార్మర్ను మరమ్మత్తులు చేయడంలో విద్యుత్ అధికారులు విఫలమవుతున్నారు. ట్రాన్స్ఫార్మర్ కాలిపోయిన సమాచారం జేఎల్ఎం నుంచి డివిజనల్ అధికారి వరకు సమాచారం ఉంది. అయినా కూడా ఏ ఒక్కరు స్పందించడం లేదు. ట్రాన్స్ఫార్మర్ మీద ఆధారపడి ఉన్న రైతులు నార్లు పోసుకొని ఎండిపోయే స్థాయికి చేరుకున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి ట్రాన్స్ఫార్మర్ను మరమ్మతులు చేయాల్సిందిగా రైతుల కోరుతున్నారు.
