Cricket | HCA కొత్త అధ్యక్షుడిగా అమర్‌నాథ్..

Cricket | HCA కొత్త అధ్యక్షుడిగా అమర్‌నాథ్..
Cricket |వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) కొత్త ప్రెసిడెంట్‌గా అమర్‌నాథ్ (Amarnath) నియమితులయ్యారు. ఈ మేరకు ఇవాళ బీసీసీఐ అంబుడ్స్‌మన్ నుంచి అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. మాజీ అధ్యక్షుడు జగన్‌మోహన్ రావు (Jaganmohan Rao) అరెస్ట్ అయ్యాక గత 9 నెలలుగా హెచ్‌సీఏ అధ్యక్ష పదవి ఖాళీగా ఉంది.
ఈ క్రమంలోనే తనను హెచ్‌సీఏ అధ్యక్షుడిగా నియమించాలంటూ ఇటీవలే అమర్‌నాథ్ అంబుడ్స్‌మన్‌ను ఆశ్రయించారు. ఆయన అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న అంబుడ్స్‌మన్, అమర్‌నాథ్‌ను హెచ్‌సీఏ అధ్యక్షుడిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
గతంలో హెచ్సీఏకి జరిగిన ఎన్నికల్లో కేవలం ఒక ఓటు తేడాతో జగన్మోహన్ రావు గెలిచారు. జగన్మోహన్ రావుకి 63 ఓట్లు రాగా… అమర్నాథ్ కు ఒక ఓటు తక్కువగా 62 ఓట్లు వచ్చాయి. దీంతో, హెచ్సీఏ అధ్యక్షుడిగా జగన్మోహన్ రావు బాధ్యతలు చేపట్టారు. అయితే, శ్రీచక్ర అనే క్రికెట్ క్లబ్ ను సృష్టించి అక్రమ ఓటింగ్ కు పాల్పడినట్టు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో ఆయనపై కేసు నమోదు చేసిన పోలీసులు… ఆయనను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఆయనను అసోసియేషన్ అధ్యక్ష పదవి నుంచి తొలగించారు.
