What SAD ? : మగతకు చెక్ ఇలా..

What SAD ? : మగతకు చెక్ ఇలా..
- అతి నిద్రకు మెలటోనిన్ కారణం
- D విటమిన్ తో మగత పరార్
- ఎండలో ఇలా తిరిగితే.. అలా..
( ఆంధ్రప్రభ, ఏపీ న్యూస్ నెట్ వర్క్ ప్రతినిధి) What SAD ? చలిగా..చలిగా.. గిలిగింతగా.. కుర్రకారులకు రొమాంటిక్ పాటలు గుర్తుకు వస్తాయి. తెల్లవారగానే.. టైమ్ చూసుకుని ఐటీ స్టాప్ .. నాన్ స్టాప్ లా… కంగారెత్తిపోతారు. బ్రష్ తో పళ్లుతోముకుని, కనీసం స్నానం చేయకుండా ల్యాప్ ట్యాప్ బ్యాగ్ సర్దేసి .. సెల్ ఫోన్ లో ర్యాపిడో వెహికల్ బుకింగ్ కు తంటాలు పడతారు. పది నిముషాల్లో బయోమెట్రిక్ ఎదుట కళ్లు ఆర్పక పోతే.. లీమ్ లీడర్ తిట్లు తారా స్థాయికి చేరుతాయి. ఇది సరే..

ఇక కూలీనాలీ జనమే చలి మంటల ముందు కూర్చోని .. అసలు కదలరు. ఇక ఆఫీసర్లు సంగతి సరే సరి. గుమప్తాల గోల అంతా ఇంత కాదు. ఔను.. చలికాలం రాగానే జీవన పోరాటంలో అత్యధిక జనం ఎందుకు అల్లాడిపోతారు? చలి కాలం చలి ఎక్కువగానే ఉంటుంది. హాయిగా దుప్పట్లో బొజ్జోకుండా.. ఈ జనం ఎందుకు ఉరుకులు పరుగులు పెడతారంటే.. రాత్రంతా వెచ్చటి దుప్పట్లో తొంగుంటారు. ఉదయమే మెలుకువ రాదు. ఇంకేముందీ.. ఆఫీసులకు డుమ్మా కొట్టాలి. లేదా పరుగులు తీయాలి. అసలు .. ఈ మగత (Sad) నిద్ర ఎందుకు దాపురించిందిరా.. నాయనా అని మొత్తుకుంటే.. కాదు, అసలు కారణాలు తెలుసుకోవాలి. మగత నిద్రకు బారికేడ్ వేయాలి. తప్పదు గురూ..
What SAD ? : అసలీ మగత నిద్రంటే..

చలికాలంలో పగటి ఉష్టోగ్రత వేళ తక్కువ. త్వరగా చీకటి పడుతుంది. అంతే చలిగాలి పలకరిస్తుంది. గిలిగింతలు పెడుతుంది. టక్కున దుప్పటిలో దూరిపోతారు. నిద్ర కూడా వచ్చేస్తుంది. ఆ తరువాత మెలుకవే.. దాని ఇష్టం. ఎందుకంటే ఎక్కువగా నిద్రపోవడం, మగత (lethargy ) చాలా సహజ లక్షణం.
What SAD ? :. మగతకు కారణమేంటీ

నగటి పూట సూర్యకాంతి తగ్గిపోతుంది. (Less daylight) చలికాలంలో పగటి కాలం అతివేగంగా దూసుకుపోతుంది. త్వరగా సూర్యుడు అస్తమిస్తాడు. సూర్యరశ్మి విపియోగం తగ్గుతుంది. అప్పుడే మెదడులో మెలటోనిన్ (Sleep Harmone) ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఫలితంగా నిద్ర మత్తు పెరుగుతుంది. మగత ఆవులిస్తుంది. ఇది SAD సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ చలికాలంలో కొందరిలో ( winter Depression) డిప్రెషన్ కు లోనవుతారు. ఎక్కువగా నిద్రపోవాలనిపిస్తుంది. దీన్ని వింటర్ బ్లూస్ (winter Blues) అని కూడా అంటారు. చలి కారణంగా.. శరీరం ఎక్కువ ఉష్ణోగ్రతను వినియోగిస్తుంది. శక్తి వినియోగం పెరిగి శారీరకంగా అలసట ఏర్పడుతుంది, మగత వస్తుంది.
What SAD ? : .విటమిన్ D లోపంతోనే

విటమిన్ D లోపంలోనే మగత ఆవరిస్తుంది. సూర్యరశ్మి తగ్గితే విటమిన్ D ఉత్పత్తి, ఉదార్గం తగ్గుతుంది . ఇది మూడ్, ఎనర్జీ లెవెల్స్‌ను ప్రభావితం చేస్తుంది. ఇంట్లోనే ఎక్కువ సమయం గడపడం, బయట చలిగా ఉందని ఇంట్లోనే దుప్పటి కప్పుకుని పడుకోవడం, టీవీ / మొబైల్ చూడడంతో శారీరక శ్రమ తగ్గి మగత పెరుగుతుంది.
What SAD ? సరే మగతకు చెక్ ఎలా..?
ఉదయాన్నే శరీరానికి సూర్యరశ్మి తగలనివ్వండి , ఉదయం 7– 9 గంటల మధ్యలో 15–30 నిమిషాలు ఎండలో నడిచి, సూర్యకాంతి పడనివ్వండి. ఇది మెలటోనిన్‌ను (Melatonin) అదుపులో పెడుతుంది. సీరోటోనిన్ (Mood Buster) ను పెంచుతుంది. రోజూ వ్యాయామం చాలా ముఖ్యం, ఇంట్లోనే కనీసం 20–30 నిమిషాలు బ్రిస్క్ వాకింగ్, యోగా, జంపింగ్ జాక్స్, స్కిప్పింగ్ చేయాలి. అప్పుడు ఎండార్ఫిన్స్ (Endarpin) విడుదలై మగత పోతుంది.
What SAD ? : ఆహారంలో మార్పు అనివార్యం

ప్రతిరోజూ ఉదయం పూట గుడ్డు, పెరుగు, చిక్కుళ్ళు, పప్పు ధాన్యాలు తదిరల ప్రోటీన్ పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. రాత్రి పూట కార్బోహైడ్రేట్స్ (Carbohydrates) అన్నం, రొట్టె తగ్గించాలి. – చేపలు, (Fish) గుడ్డు (egg) పచ్చ సొన, పాలు (Milk), విటమిన్ B12 ఆహారంలో ఉండే విధంగా చూడాలి. ఒకవేళ ఐరన్ లోపం ఉంటే డాక్టర్‌ని సంప్రదించాలి.
చలికాలంలో చాలా మందికి విటమిన్ D లోపం ఎక్కువగా ఉంటుంది. బ్లడ్ టెస్ట్ చేయించుకుని, అవసరమైతే వారానికి ఒకసారి 60,000 IU సప్లిమెంట్ తీసుకోవచ్చు. అవసరమైతే లైట్ థెరపీ తప్పదు. మగత ఎక్కువగా ఉంటే 10,000 lux వాడే Light Therapy Lamp ను ఉదయం 20–30 నిమిషాలు వాడొచ్చు. ఇది ఆన్‌లైన్‌లో దొరుకుతుంది . ఉదయం వెచ్చని నీటి స్నానం, ఒక కప్పు గ్రీన్ టీ లేదా కాఫీ తాగితే మగత తగ్గుతుంది.
What SAD ? ఒక్కసారి నడిస్తే .. మగత మాయం

చలికాలంలో అందరికీ మగత వస్తుంది కానీ రోజూ ఉదయం సూర్యరశ్మిలో (Sun Light) వ్యాయామం చేసి సరైన నిద్ర షెడ్యూల్ ను పాటిస్తే 80 నుంచి 90 శాతం మందిలో ఈ సమస్య పరిష్కారమవుతుంది. ప్రతి రోజూ ఒకే టైంలో నిద్రలేవడం, పడుకోవడం. 10–11 గంటలకల్లా నిద్రపోవాలి, 6–7 గంటలకు మెలుకవలోకి రావాలి. ఇలా నిద్ర షెడ్యూల్ (Sleep Shedule) ను పాఠించాలి. మిగతా 10 శాతం మందికి విటమిన్ D లోపం లేదా థైరాయిడ్ సమస్య ఉండవచ్చని అంచనా. అది బ్లడ్ టెస్ట్ లో తెలుస్తుంది. వైద్యులను సంప్రదించటం మంచిది. చలి ఉన్నా లేచి నడవండి, ఒక్కసారిగా శరీరం వేడెక్కి మగత మాయం అవుతుంది.
Click Here To Read More
Click Here To Read This పోస్ట్-స్ట్రోక్ కేర్ అవసరం..

Pingback: Surreder Date Fixed :మావోయిస్టుల ముహూర్తం ఖరారు