Collector | సుఖ సంతోషాలతో ఉండాలి..

Collector | సుఖ సంతోషాలతో ఉండాలి..
- జిల్లా ప్రజలకు కలెక్టర్ సంక్రాంతి శుభాకాంక్షలు
Collector | కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : జిల్లా ప్రజలకు భోగి, సంక్రాంతి, కనుమ పండుగల సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి పండుగను జిల్లా ప్రజలంతా సుఖసంతోషాలతో, భోగ భాగ్యాలతో, సిరి సంపదలతో తలతూగుతూ జరుపుకోవాలని కలెక్టర్ ఆకాంక్షించారు. తొలి రోజు భోగి మంటలతో, రెండో రోజు సంక్రాంతిని పొంగలి, పిండివంటలు, పితృదేవతలు, దేవుళ్ల పూజలతో, మూడో రోజు కనుమను కుటుంబ సభ్యులతో ఆనందోత్సాహాల మధ్య నిర్వహించుకోవాలని సూచించారు.
ఈ పండుగలు ప్రజల జీవితాల్లో సుఖశాంతులు, సమృద్ధిని తీసుకురావాలని, అందరికీ మంచి జరగాలని ఆకాంక్షిస్తూ జిల్లా ప్రజలందరికీ కలెక్టర్ పండగ శుభాకాంక్షలు తెలియజేశారు.
