temple | వైభవంగా రఘునాథుని కల్యాణ మహోత్సవం
temple | వైభవంగా రఘునాథుని కల్యాణ మహోత్సవం
temple | కుంటాల, ఆంధ్రప్రభ : మండల కేంద్రమైన కుంటాల శ్రీకృష్ణ ప్రాచీన ఆలయంలో రఘునాథ స్వామి గంగాదేవి శ్రీ రఘునాథ కళ్యాణ మహోత్సవాన్ని ఈ రోజు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంగరంగ వైభవంగా ఆలయంలో పవిత్ర గంగా జలాలను తీసుకువచ్చి ఆలయాన్ని శుభ్రపరచారు. అనంతరం ఆలయం(temple)లో సాయి వారికి పలు రకాల అభిషేకాలు(Anointings) నిర్వహించారు. కమనీయంగా కళ్యాణం చేపట్టారు.

సాంస్కృతిక నృత్యాలు చేపట్టారు. మహిళలు మంగళహారతులతో స్వామివారికి స్వాగతం పలికారు. భక్తులు అధిక సంఖ్యలో శ్రీకృష్ణ ప్రాచీనాలయంలోని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రఘునాథ స్వామి కళ్యాణ మహోత్సవ సందర్భంగా ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.
