ఓపెన్ ప్లై ఓవర్ బ్రిడ్జిని నిర్మించాలి..

ఓపెన్ ప్లై ఓవర్ బ్రిడ్జిని నిర్మించాలి..
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ డివిజన్ కేంద్రంలోని జాతీయ రహదారి 65 విస్తరణలో భాగంగా చౌటుప్పల్ బస్టాండ్ ఎదురుగా ఓపెన్ ప్లై ఓవర్ బ్రిడ్జిని నిర్మించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ డిమాండ్ చేశారు. కందాల రంగారెడ్డి స్మారకభవనంలో పార్టీ మున్సిపల్ కార్యదర్శి గోశిక కరుణాకర్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో జహంగీర్ మాట్లాడుతూ.. చౌటుప్పల్ పట్టణం హైదరాబాద్ కు దగ్గరలో ఉండడం వలన 60 వేల జనాభాతో అభివృద్ధి జరుగుతుంది. నేషనల్ హైవే 65 విస్తరణలో భాగంగా కేవలం చిన్న కొండూరు రోడ్డు, తంగడపల్లి రోడ్డు, వద్ద మాత్రమే ఓపెన్ ఫ్లైఓవర్ బ్రిడ్జిని నిర్మించడం వల్ల బస్టాండుకు వెళ్లాల్సినటువంటి బస్సులు, వాహనాలకు, ప్రయాణికులకు, ఇబ్బందిగా మారుతుందని అన్నారు.
హైవే అధికారులు, స్థానిక ఎమ్మెల్యే, శ్రద్ధ వహించి, బస్టాండు ఎదురుగా ఓపెన్ ప్లై ఓవర్ బ్రిడ్జిని నిర్మించి, వ్యాపారస్తులను, స్థానిక ప్రజలను కాపాడాలని కోరారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బూరుగు కృష్ణారెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు ఎండి పాషా, రాగిరి కిష్టయ్య, నాయకులు గంగాదేవి సైదులు, బండారు నరసింహ, బత్తుల దాసు, ఆకుల ధర్మయ్య, బొడ్డు అంజిరెడ్డి, సప్పిడి శ్రీనివాస్ రెడ్డి, తూర్పునూరు మల్లేశం, చికూరు ఈదయ్య, భావనలపల్లి స్వామి, సిల్వేరు జంగయ్య, మొగుదాల రాములు తదితరులు పాల్గొన్నారు.
