సీఎంఆర్ఎఫ్‌తో పేదల వైద్యానికి అండ: సర్పంచ్
కడెం, ఆంధ్రప్రభ: పేదల వైద్య చికిత్స కోసం తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా పెద్దఎత్తున ఆర్థిక సహాయం అందిస్తూ అండగా నిలుస్తోందని ఉడుంపూర్ గ్రామ సర్పంచ్ జొన్నల చంద్రశేఖర్ గుప్తా అన్నారు. కడెం మండలంలోని ఉడుంపూర్ గ్రామానికి చెందిన మెంగని నరసయ్యకు వైద్య చికిత్స నిమిత్తం ప్రభుత్వం నుంచి రూ.60 వేల సీఎంఆర్ఎఫ్ నిధులు మంజూరయ్యాయి.
ఖానాపూర్ ఎమ్మెల్యే వేడమ బొజ్జు ఆదేశాల మేరకు ఉడుంపూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మంజూరైన రూ.60 వేల చెక్కును నరసయ్య భార్య లక్ష్మవ్వకు సర్పంచ్ జొన్నల చంద్రశేఖర్ గుప్తా స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి అందజేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ పేదల ఆరోగ్య రక్షణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపుతూ సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఉడుంపూర్ గ్రామపంచాయతీ మొదటి వార్డు సభ్యుడు అజ్మీర రవీందర్, కాంగ్రెస్ నాయకులు బెడద సత్తయ్య, జి. శ్రీనివాస్, దొంతుల శ్రీనివాస్, పున్నం నాయక్, ఈజీఎస్‌ఎఫ్‌ఏలు బి. సత్తయ్య, నాగవత్ రవీందర్, గ్రామస్తులు పాల్గొన్నారు.
