సోంపేటలో విషాదం..
- రైల్వే పట్టాలపై యువకుడి మృతదేహం
- దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
సోంపేట, ఆంధ్రప్రభ : మండలం బారువ కొత్తూరు గ్రామానికి చెందిన వలిశెట్టి అనీష్ (21) కొర్లం సమీపంలోని రైల్వే ట్రాక్‌పై మృతిచెంది కనిపించాడు. స్థానికులు మృతదేహాన్ని గుర్తించి వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. ఆదివారం ఉదయం సుమారు 9 గంటల సమయంలో రైల్వే ట్రాక్‌పై యువకుడి మృతదేహం తల, మొండెం వేర్వేరుగా ఉన్న దృశ్యాలను కొందరు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు.

వాటిని చూసిన కుటుంబ సభ్యులు మృతుడు బారువ కొత్తూరు గ్రామానికి చెందిన ఆర్మీ రిటైర్డ్ ఉద్యోగి వలిశెట్టి భవాని కుమారుడు, వలిశెట్టి జోగారావు మనవడు అయిన అనీష్‌గా గుర్తించినట్లు సమాచారం. ప్రాథమికంగా ఇది ఆత్మహత్యగా అనుమానిస్తున్నప్పటికీ, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
