CM| నాయకుల ముందస్తు అరెస్ట్

CM| ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో గురువారం జరగనున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనను పురస్కరించుకుని పోలీసులు కఠిన భద్రతా చర్యలు(Strict security measures) చేపట్టారు. ఈ నేపథ్యంలో ఉట్నూర్ ఎస్‌ఐ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఆదివాసి మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు పెందూర్ పుష్ప రాణి, ఆదివాసి హక్కుల పోరాట సమితి(Aboriginal Rights Struggle Committee) తుడుం దెబ్బ రాష్ట్ర కార్యదర్శి పుర్క బాపురావును గురువారం తెల్లవారుజాము నాలుగు గంటలకు ముందస్తు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని ఉట్నూర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు సమాచారం.
