CM Revanth | రూ.4.33 కోట్ల కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

CM Revanth | రూ.4.33 కోట్ల కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

  • ప్ర‌జ‌ల సంక్షేమ‌మే ప్ర‌భుత్వ ధ్యేయం : ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్‌

Karimnagar | గోదావరిఖని టౌన్, ఆంధ్ర‌ప్ర‌భ : ప్ర‌జ‌ల సంక్షేమ‌మే ప్ర‌భుత్వ ధ్యేయ‌మ‌ని రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ అన్నారు. ఈ రో్జు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 433 మంది కళ్యాణలక్ష్మి(433 Kalyanalakshmi), షాదీ ముబారక్ లబ్ధిదారులకు రూ. 4,33,50,228 విలువైన చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.

ఈ సంద‌ర్భంగా రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గం అభివృద్ధి చేయాల‌నే ఆలోచనతో ముందుకు వెళ్తున్న ప్రతి నిరుపేద కుటుంబాలను గుర్తించి తెలంగాణ ప్రజా ప్రభుత్వం ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) ఇస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి నిరుపేద కుటుంబానికి అందే విధంగా చేస్తున్నామని తెలిపారు. ప్రతి ఆడబిడ్డ కళ్లల్లో సంతోషం చూడడమే త‌న లక్ష్యమ‌ని, అభివృద్ధి–సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమ‌ని అన్నారు. ప్రజాసేవకునిగా ఎల్లప్పుడూ ప్రజలకు అండగా ఉంటానని పేర్కొన్నారు.

రామగుండం కార్పొరేషన్‌లో ఇప్పటివరకు మొత్తం నాలుగు కోట్లు 33 లక్షల 50 వేల 228 రూపాయలు(four crore 33 lakh 50 thousand 228 rupees) కళ్యాణలక్ష్మి – షాదీ ముబారక్ పథకాల ద్వారా పంపిణీ చేశామ‌ని ఆయ‌న వివ‌రించారు. అంతర్గం మండలం, పాలకుర్తి మండలాల్లో రూ. 2 కోట్లు చొప్పున మహిళా భవన–ఫంక్షన్ హాళ్లను నిర్మించనున్నట్లు వెల్లడించారు. ఎక్కడా పేద కుటుంబం లేకుండా చేయడమే త‌న సంక‌ల్ప‌మ‌న్నారు.

ఈ నగరాన్ని సంపూర్ణ అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు ప్రతి గల్లీలో రోడ్లు, డ్రైనేజీ, లైటింగ్ వంటి మౌలిక వసతులు మెరుగుపరుస్తున్నామ‌ని ఎమ్మెల్యే అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఐటీ శాఖ మంత్రి బుద్ధుల శ్రీధర్ బాబు సహకారంతో రామగుండం అభివృద్ధి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలుస్తుంద‌న్నారు.

రామగుండంలో 1×800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేపట్టడం జరుగుతుందని, సింగరేణి నిధులతో రూ. 25 కోట్లుతో సింగర్ క్వార్టర్స్ ఏరియా(Rs. Singer quarters area with 25 crores)లో రహదారులు, డ్రైనేజీ పనులు మొదలయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు, వివిధ విభాగాల అధ్యక్షులు పాల్గొన్నారు.

గోదావరిఖని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పాలకుర్తి, అంతర్గం మండలాల ముఖ్య నాయకులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ అధ్యక్షులు, పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జరిగిన ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్(MLA Raj Thakur) మాట్లాడుతూ, కార్యకర్తలు ఒకే దిశగా కృషి చేస్తే పార్టీ విజయాలు నిర్ధారితం. ప్రజల అభివృద్ధి కోసం అందరూ ఏకతాటిపై పని చేయాల‌ని సూచించారు. కార్యకర్తల సమన్వయమే విజయానికి మూలం పేర్కొన్నారు.

Leave a Reply