ప్లాస్టిక్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలి..

ఘంటసాల, ఆంధ్రప్రభ : గ్రామీణ ప్రాంతాల్లో ప్లాస్టిక్ నిర్మూలనకు ప్రతి ఒక్కరు సహకరించాలని శ్రీకాకుళం డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ అయినపూడి భానుప్రకాష్ తెలిపారు. బుధవారం స్వచ్ఛ రథం ఘంటసాల గ్రామానికి రాగా, పలువురు ప్రజలు తమ ఇంటిలో ఉన్న పాత వస్తువులు స్వచ్చ రధానికి అందజేశారు.

ఈ సందర్భంగా భాను ప్రకాష్ మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వినూత్న ఆలోచనతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. ఎంపీడీవో సుబ్బారావు మాట్లాడుతూ ప్రతి గ్రామము స్వచ్ఛ రధం తిరుగుతుందని గ్రామస్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఇళ్లల్లో ఉన్న పాత సామాగ్రిని అందజేసి నిత్యవసర సరుకులు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి విజయలక్ష్మి, సిబ్బంది పాల్గొన్నారు.