Christmas | సర్వమానవాళికి శాంతి బోధకుడు క్రీస్తు

Christmas | సర్వమానవాళికి శాంతి బోధకుడు క్రీస్తు
- ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి
- మండలంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
Christmas | కొత్తూరు, ఆంధ్రప్రభ : సర్వ మానవాళికి శాంతి ప్రబోధకుడు ఏసుప్రభువు అని ఉమ్మడి మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని ఫాతిమాపూర్ గ్రామంలో గల ఫాతిమా మాత చర్చిలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు అల్విన్ రెడ్డి, దిలీప్ రెడ్డి ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి హాజరై కేక్ ను కట్ చేసి క్రైస్తవులతో కలిసి వేడుకలను నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పిన్నింటి మధుసూదన్ రెడ్డి, సీనియర్ నాయకులు కడెంపల్లి శ్రీనివాస్ గౌడ్, జగన్మోహన్ రెడ్డి, ఫాదర్ సొల్మన్ రెడ్డి, మర్రెడ్డి, సాంసన్ రెడ్డి, యాగారెడ్డి, మదీయాస్ రెడ్డి, బాల్రెడ్డి, ఇన్నారెడ్డి, సుధాకర్ రెడ్డి, ప్రతాపరెడ్డి, రాజారెడ్డి, జోసఫ్ రెడ్డి, చిన్నపరెడ్డి, జైపాల్ రెడ్డి, ఆరోగ్య రెడ్డి, గోపాల్ గౌడ్, సోమ్లా నాయక్, శ్రీనివాస్ గౌడ్, బ్యాగరీ యాదయ్య, జంగగళ్ళ కృష్ణయ్య, శ్రీరాములు, రాములు గౌడ్, బోకుల రాజు, బ్యాంక్ సురేష్, శాంసంన్ రెడ్డి, రాజు గౌడ్, లింగం గౌడ్, చిర్ర రాజు, శివ చారి, సాగర్, అనిల్, దయానంద రెడ్డి, ఫాతిమాపూర్ గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
