జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీ కల్పించాలి..
చిట్యాల, ఆంధ్రప్రభ: ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న జర్నలిస్టుల పిల్లలకు 50 శాతం ఫీజు రాయితీ అమలు చేసేలా జిల్లా విద్యాశాఖ అధికారులు తక్షణమే సర్క్యులర్ జారీ చేయాలని డిమాండ్ చేస్తూ టీయూడబ్ల్యూజే (ఐజేయూ) ఆధ్వర్యంలో సోమవారం చిట్యాల మండల విద్యా వనరుల కేంద్రం ఎదుట జర్నలిస్టులు నిరసన చేపట్టారు.
అనంతరం మండల విద్యాధికారి సైదా నాయక్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. జర్నలిస్టుల పిల్లలకు ప్రభుత్వం ప్రకటించిన ఫీజు రాయితీ అమలుకు వెంటనే సర్క్యులర్ జారీ చేసి, అన్ని ప్రైవేటు విద్యాసంస్థలకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు ఏళ్ల బయన్న, మండల అధ్యక్షుడు మేండే వెంకన్న, ప్రధాన కార్యదర్శి పోకల కరుణాకర్, ఉపాధ్యక్షుడు ఏళ్ల వెంకన్న, సహాయ కార్యదర్శి కూనూరు మధు, గౌరవ సభ్యులు మిర్యాల ప్రకాశ్, జిట్ట మల్లేష్, అమరోజు వెంకన్న, చికిలంమెట్ల మెహర్ బాబు, కాలిన శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.
