సఫాయి కార్మికుని కుటుంబానికి ఆర్థిక సహాయం

సఫాయి కార్మికుని కుటుంబానికి ఆర్థిక సహాయం

ఎస్సెస్సీ బ్యాచ్ రూ. 18,500, పంచాయతీ సిబ్బంది రూ. 25 వేలు అందజేత

కేసముద్రం, మే 20(ఆంధ్రప్రభ): ఉప్పరపల్లి గ్రామపంచాయతీ సిబ్బంది సఫాయి పని చేస్తూ జీవనం గడుపుతున్న గద్దల సునీత భర్త గద్దల ప్రభాకర్ అకాల మరణంతో, ఆ కుటుంబానికి ఆర్థిక సహకారముగా ఉప్పరపల్లి గ్రామ పాలకవర్గం, పంచాయతీ సిబ్బంది, 25000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. అదేవిధంగా కేసముద్రం జడ్పీహెచ్ఎస్ పాఠశాల 1987-88 బ్యాచ్ స్నేహితులు గద్దల ప్రభాకర్ కుటుంబ సభ్యుల అండగా నిలిచారు. ఈసందర్భంగా ఆ కుటుంబానికి చిన్ననాటి స్నేహితులు 18,500 ప్రభాకర్ భార్య అయిన సునీతకు అందజేశారు.

అలాగే వారి స్నేహితులు ఎల్లవేళల ప్రభాకర్ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇవ్వడం జరిగింది. వేరు వేరుగా ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఏర్పుల సునీత కుమారస్వామి, ఉప సర్పంచ్ ఆవుల ఐలయ్య, గ్రామ కార్యదర్శి, వెంకన్న, గ్రామ వార్డ్ సభ్యులు, జనేగల అనిల్ కుమార్, జీజుల వరలక్ష్మి, రాజబోయిన శ్రీను, భునగిరి జ్యోతి, కుండే బాల కుమార్, కంచ రాజకుమార్, పలుస పద్మ, తండ సంపత్, సుదగాని మమత, బండారు యాకమ్మ, గోపీనాథ్, మంద ప్రవీణ్, కారోబార్ కంచ కట్టయ్య, సిబ్బంది విజయ్, అనిల్, వెంకన్న, యాకయ్య, సుగుణ, లావణ్య, ఎస్ఎస్సి పూర్వ విద్యార్థులు రాపాక వెంకట్ నారాయణ, కోమటిరెడ్డి పిచ్చిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply