Children | చిన్నారులకు పౌష్టికాహారం అందించండి..

Children | చిన్నారులకు పౌష్టికాహారం అందించండి..

Childrens | కర్నూలు ఆంధ్రప్రభ:  అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు  మెనూ ప్రకారం నాణ్యతతో కూడిన పౌష్టికాహారం అందించాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి అంగన్వాడీ సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం దేవనకొండ మండల కేంద్రంలో  అంగన్వాడీ కేంద్రాన్ని, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా  కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా  కలెక్టర్  అంగన్వాడీ కేంద్రంలో పిల్లలతో కాసేపు ముచ్చటించారు. పిల్లలను ఏమి తిన్నారని ఆప్యాయంగా అడిగి తెలుసుకున్నారు. అంగన్‌వాడీ కేంద్రాన్ని(Anganwadi Center) పరిశీలిస్తూ,  చాలా శుభ్రంగా నిర్వహిస్తున్నారని కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి రోజు ఇదే విధంగా ఉండాలని  కలెక్టర్ అంగన్‌వాడీ సిబ్బందిని ఆదేశించారు.

కిచెన్ గదిని పరిశీలిస్తూ కోడిగుడ్లు స్టాక్ వచ్చినపుడు వాటిని చెక్ చేసుకొని తీసుకోవాలని కలెక్టర్ అంగన్వాడి సిబ్బందిని ఆదేశించారు. ప్రతి రోజు పిల్లలకు పాలు ఇస్తున్నారా అని కలెక్టర్ (Collector) అంగన్వాడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు… అంగన్వాడీ కేంద్రంలో మొత్తం ఎంతమంది పిల్లలు ఉన్నారు? ఈరోజు ఎంతమంది వచ్చారు?వారికి మెనూ ప్రకారమే భోజనం పెడుతున్నారా అని కలెక్టర్ అంగన్వాడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అంగన్‌వాడీ కేంద్రం పరిసరాల్లో కూడా పరిశుభ్రంగా ఉండేలా  చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎంపిడిఓ ను ఆదేశించారు.

పదో తరగతి పరీక్షల్లో వంద శాతం  ఉత్తీర్ణత సాధించాలి

పదో తరగతి పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని కలెక్టర్ విద్యార్థులకు సూచించారు. క్రమశిక్షణతో చదువుకోవడం, పాఠశాలలో ఉపాధ్యాయుల సూచనలు పాటించడం ద్వారా విజయాన్ని సాధించవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు.. ప్రతి ఒక్కరూ కష్టపడి చదవాలని కలెక్టర్ విద్యార్థులకు సూచించారు. ఉపాధ్యాయులు (Teachers) ఏ విధంగా పాఠాలు చెబుతున్నారు? భోజనం రుచిగానే పెడుతున్నారా?ఏమైనా సమస్యలు ఉన్నాయా ? అని కలెక్టర్ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.

మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం రుచిగా అందించాలి

అనంతరం వంట గదిని పరిశీలిస్తూ రాగి జావ కొంచెమే చేశారు ఎందుకు అని ప్రశ్నించారు. పిల్లలు కొంతమంది మాత్రమే తాగుతున్నారు సిబ్బంది చెప్పగా విద్యార్థులందరికీ (For All Students) సరిపడే విధంగా రాగి జావ తయారుచేసి, అందరూ తాగే విధంగా పిల్లలను ఒప్పించాలని కలెక్టర్ సూచించారు. మధ్యాహ్న భోజన రుచి చూసి, భోజనం రుచిగా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. మండల విద్యా శాఖాధికారి తరచుగా పాఠశాలలను తనిఖీ చేసి మధ్యాహ్న భోజనం రుచిగా ఉండేలా పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. మెనూ ప్రకారం  రుచి, శుచి తో కూడిన మధ్యాహ్న భోజనం (Lunch) వడ్డించాలని పాఠశాల హెడ్మాస్టర్ ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ జ్యోతి,  ఎమ్ఈఓ తిమ్మారెడ్డి, విజయకుమారి, హెడ్ మాస్టర్ నజీర్ మహమ్మద్, తదితరులు పాల్గొన్నారు.