Kosigi | మామను చంపిన అల్లుడు

Kosigi | మామను చంపిన అల్లుడు
Kosigi | కోసిగి, ఆంధ్రప్రభ : కోసిగి మండలం (Kosigi mandal) లో జరిగిన దారుణహత్య కలకలం రేపింది. దుద్దిలో మద్యం మత్తులో అల్లుడు తన మామను గొంతునులిమి హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Kosigi |పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… చెడు ప్రవర్తనతో తరచూ సమస్యలు సృష్టించే అల్లుడు నరసింహ ను మామ గోవిందయ్య (Govindaiah) పలుమార్లు మందలించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో సోమవారం జరిగిన వాదనలో నరసింహ మద్యం మత్తులో కోపం ఆపుకోలేక గోవిందయ్యపై దాడి చేసి గొంతునులిమి చంపినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
నేరాన్ని దాచేందుకు…
తన నేరాన్ని దాచేందుకు నరసింహ (Narasimha) కేసును డైవర్ట్ చేయాలనే ప్రయత్నంలో రాత్రంతా మృతదేహం పక్కనే పండుకొని హై డ్రామా సృష్టించినట్టు విచారణలో బయటపడింది. ఉదయం గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేయడంతో ఘటన పోలీసుల దృష్టికి వచ్చింది.
సూచన మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పంచనామా నిర్వహించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సైలు తెలిపారు. ఈ ఘోర సంఘటనతో కోసిగి మండలంలో తీవ్ర కలకలం రేగింది.
