Breaking | టెంపో–ట్యాంకర్ ఢీ.. ముగ్గురు మృతి..
ఆంధ్రప్రభ, చిత్తూరు: ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శాంతిపురం మండలం కడపల్లి సమీపంలో వాటర్ ట్యాంకర్‌ను టెంపో బలంగా ఢీకొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల పరిస్థితిపై వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుల వివరాలు, ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.
