సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

బస్వపూర్ సర్పంచ్ రమణ సురేష్ గొండ

జుక్కల్ (కామారెడ్డి) ఆంధ్రప్రభ : నిరుపేదల సొంతింటి కలను రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సాకారం చేస్తుందని బస్వాపూర్ గ్రామ సర్పంచ్ వీ.రమణ సురేష్ గొండ తెలిపారు.మంగళవారం నాడు ఉపసర్పంచ్ బొర్కర్ అనిల్ తో కలిసి అర్హులకు మంజూరైన రెండు ఇందిరమ్మ గృహాలకు మార్క్ ఔట్ వేయించి,భూమి పూజ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి బాట పట్టిందని, జుక్కల్ నియోజకవర్గన్నీ అన్ని రంగాల్లో తీర్చిదిద్దేందుకు ఎమ్మెల్యే తోట లక్ష్మికాంతరావు కృషి చేస్తున్నారని, అర్హులందరికీ ఇందిరమ్మ గృహాలను మంజూరు చేసి సొంత ఇంటి కలలు సహకారం చేయడమే కాకుండా జుక్కల్ నియోజకవర్గంలో పూరి గుడిసె లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దటం ఎమ్మెల్యే ప్రధాన ధ్యయామని ఆమె అన్నారు.

గ్రామస్తుల సహకారంతో బస్వపూర్ ను అన్నిరంగాల్లో అభివృద్ధి పరచడం జరుగుతుందని, ప్రజలందరికీ మౌలిక వసతులు కల్పించడం జరుగుతుందని ఆమె అన్నారు. ఈసందర్భంగా గ్రామ కార్యదర్శి భరద్వాజ్, వార్డు సభ్యులు సంగ్రామ్, బీరుగొండ నాగనాథ్ తో పాటు గ్రామస్తులు అనిల్, గంగారాం సాయిగొండ, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Leave a Reply