కాళేశ్వరం తీర్పు కాంగ్రెస్‌కు చెంపపెట్టు….

కాళేశ్వరం తీర్పు కాంగ్రెస్‌కు చెంపపెట్టు….

బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు నజీర్ అహ్మద్
విలేకరుల సమావేశంలో మాట్లాడిన నాయకులు

కేసముధ్రం, ఆంధ్రప్రభ : కాళేశ్వరంపై హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వనికి చెంపపెట్టనీ బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు నజీర్ అహ్మద్ అన్నారు. బీఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో శనివారం కేసముద్రం మున్సిపాలిటీ కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గపు ఇంచార్జ్ మాజీ శాసనసభ్యులు బానోత్ శంకర్ నాయక్ ఆదేశాల మేరకు నిర్వహించడం జరిగింది.

ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు మొహమ్మద్ నజీర్ అహ్మద్ అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర సాధకులు తెలంగాణ అభివృద్ధి ప్రదాత ప్రజా సంక్షేమ ప్రదాత కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఈ రాష్ట్ర రైతన్ననికి కాలేశ్వరం అనే బృహత్తర ఎత్తిపోతల పథకం ప్రపంచంలోనే ఎక్కడలేని విధంగా నిర్మించి తెలంగాణ రాష్ట్రంలో అన్ని గొలుసు కొట్టు చెరువులకు నీళ్లు అందించి భూగర్భ జలాలను పెంచినారు.

రైతుల కష్టాలను దృష్టిలో పెట్టుకొని రైతుబంధు, నిరంతరం 24 గంటలు విద్యుత్ సరఫరా పండిన పంటలను నాటి ప్రభుత్వం కొనుగోలు చేసి రైతుకు కష్టం లేకుండా చేసినారు. దీనిని చూసి ప్రజాదరణను చూసి ఓర్వలేక కాంగ్రెస్ పార్టీ బి ఆర్ఎస్ పార్టీ నేతలకు నానా ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం వేసిన అర్జీలను హైకోర్టు గత పాలకుల తప్పులేదని తేల్చి చెప్పినది. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది చెంపపెట్టని, కాలేశ్వరాన్ని ఏదో ఒక పిల్ల క్రాకులు వస్తే ఇది కూలిపోయిందని , పనికిరాదని ప్రచారం నిర్వహిస్తూ ఎన్ని రోజులు ప్రజాసంక్షేమాన్ని మరిచి పాలన కొనసాగిస్తున్నారు.

ఉద్యోగస్తులకు ఇచ్చిన హామీలు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు, రిటైర్డ్ ఎంప్లాయిస్ కి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా , ఈరోజు వారి ఆత్మహత్యలకు దారి చూపెట్టినారనీ ఆరోపించారు . ప్రభుత్వం ప్రజా ఓసంక్షేమాన్ని మరిచి అన్ని వర్గాల ప్రయోజనాన్ని తాకట్టు పెట్టి ఈరోజు ప్రజాపాలనాన్ని కొనసాగిస్తున్నారు. అన్ని వర్గాలకు ఎలాంటి ప్రయోజనాలు కల్పించకుండా తప్పుడు ప్రచారాలు నిర్వహించుకుంటూ, గత పాలకులను నిందించడమే ఏకైక ఎజెండా గా పెట్టుకుని పరిపాలన కొనసాగిస్తున్నారు. ఇప్పటినుంచి రైతులకు గాని, ఉద్యోగస్తులకు గాని, ఎలాంటి ఆపద వచ్చిన బి ఆర్ఎస్ పార్టీ ముందుండి పోరాడుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు 420 హామీలు నెరవేర్చాలని నెరవేర్చకుంటే ఎలాంటి పోరాటానికైనా సిద్ధమని హెచ్చ రించారు.

మొక్కజొన్న రైతులకు ముక్కలను కొని ఆదుకోవాలనీ, ఆర్టీసీ కార్మికుల కోరికలను వెంటనే అమలు చేయాలని ,మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు, ఒక్క ఉద్యోగం ఇచ్చి వారి కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నది. భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ప్రజలు ఎలాంటి అపోహల గురి కాకుండా ధైర్యంగా ఉండాలని అన్ని వర్గాల ప్రజలను కోరినారు.

ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి రావుల శ్రీనాథ్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి కమటం శ్రీనివాస్, టౌన్ పార్టీ అధ్యక్షులు గుగులోత్ వీరు నాయక్, ఊకంటి యాకూబ్ రెడ్డి, మున్సిపాలిటీ కౌన్సిలర్లు జాటోత్ సుజాత హరినాయక్, రావుల వినయ్ రెడ్డి, ఆగే రాము దూదేపాక కృష్ణ ,మేకల శారద సురేష్, పావిరాల శరత్, పురం రాజమణి రమేష్, సర్పంచులు ఈసం లక్ష్మీనారాయణ, ఎదరబోయిన సూరయ్య, బాలాజీ,జ్యోతి శ్రీనివాస్, మాజీ సర్పంచులు హరి రామ్ ముఖ్య నాయకులు పందుల సంజీవ తోట శీను, బానోత్ వెంకన్న, మాజీ ఎంపిటిసిలు కొమ్ము రాహులు, దుబ్బాక వెంకన్న, చందు, యనమల్ల ప్రభాకర్, రాయుడు కూన భద్రాద్రి, లింగాల పిచ్చయ్య, బద్రు నాయక్ తదితరులు పాల్గొన్నారు.