Former Minister | చంద్రబాబు ది రెండు నాలుకల ధోరణి

Former Minister | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : మాజీ మంత్రి ఆర్కే రోజా టీడీపీ మహానాడుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. నగరిలో మీడియాతో మాట్లాడిన ఆమె.. “టీడీపీ, చంద్రబాబుది మహానాడు కాదు.. దగానాడు అని ప్రజలకు ఇప్పటికే అర్థమైంది” అని వ్యాఖ్యానించారు.

మహానాడులో టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు బోగస్ మాటలేనని రోజా ఆరోపించారు. “మహానాడు మొత్తం వైఎస్ జగన్ నామస్మరణతోనే నిండిపోయింది. జగన్ పేరు వినగానే టీడీపీ నేతల వెన్నులో వణుకు పుడుతోంది” అని వ్యాఖ్యానించారు.

మహానాడు కార్యక్రమం పూర్తిగా ఫ్లాప్ అయ్యిందని, రికార్డింగ్ డ్యాన్సులు పెట్టి జనాన్ని బలవంతంగా సభకు తరలించే ప్రయత్నం చేశారని విమర్శించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మహానాడు వేదికగా రెండు నాలుకల ధోరణి ప్రదర్శించారని రోజా ఆరోపించారు. మహిళా రిజర్వేషన్లను అడ్డుకున్న కాంగ్రెస్ నేతలతో టీడీపీ నేతలు కలిసి డిన్నర్ చేయడం మహిళల పట్ల వారి వైఖరికి నిదర్శనమని విమర్శించారు. మహిళా రిజర్వేషన్లను వ్యతిరేకించిన వారితో కలిసి తిరిగే మీరు మహిళా ద్రోహులు అంటూ రోజా తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ప్రతిపక్ష నేతలు ప్రశ్నిస్తే కేసులు పెట్టి వేధిస్తున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దిగజారిపోయాయన్నారు. దేశంలో ఏపీ పోలీసుల ర్యాంక్ అట్టడుగు స్థానంలోకి వెళ్లిందన్నారు. ఒక్కొక్కరు ముగ్గురు, నలుగురు కనాలని చంద్రబాబు చెబుతున్నారు. మహిళలు పిల్లల్ని కనాలని చెప్పడానికి చంద్రబాబు ఎవరని రోజా ప్రశ్నించారు. మీకు దమ్ముంటే మహిళా బిల్లుకు మద్దతుగా మహానాడులో తీర్మానం చేయండని అన్నారు.

Leave a Reply