నవోదయ కాలనీ సమస్యలు పరిష్కరించాలి….
నవోదయ కాలనీ సమస్యలు పరిష్కరించాలి….
మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి వినతి
మేడ్చల్, ఆంధ్రప్రభ : సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ సర్కిల్ పరిధిలోని 297 డివిజన్ నవోదయ కాలనీలో నెలకొన్న పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కాలనీ నివాసులు శనివారం మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డినీ కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాలనీవాసులు తమ ప్రాంతంలో ఎదుర్కొంటున్న డ్రైనేజీ, సిసి రోడ్లు, వీధి దీపాలు వంటి మౌలిక వసతుల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.
కాలనీ అభివృద్ధికి తగిన నిధులు మంజూరు చేసి, పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే మల్లారెడ్డి.. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ భాస్కర్ యాదవ్ నవోదయ కాలనీ అధ్యక్షులు సీతారాం, ప్రధాన కార్యదర్శి పవన్ కుమార్, ట్రెజరర్ శేఖర్ గుప్తా కాలనీ కమిటీ సభ్యులు, పెద్ద సంఖ్యలో కాలనీవాసులు పాల్గొన్నారు.
