ఉత్తమ విద్యార్థులకు నగదు పురస్కారం..
చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూరు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో గత సంవత్సరం పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నగదు పురస్కారాలు అందజేశారు. పులి ప్రభాకర్ రావు స్మారకార్థం ఆయన కుమారుడు, మైక్రో ఫైనాన్స్ సంస్థ అధినేత పులి కిషోర్ ఈ నగదు పురస్కారాలను అందించారు. గత సంవత్సరం పదో తరగతిలో పాఠశాల నుంచి అత్యధిక మార్కులు సాధించిన బొల్లం నిఖిల్‌కు రూ.10,116, ద్వితీయ స్థానం సాధించిన అక్కల మానసకు రూ.5,116 నగదు పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పనిరాజ్, గురుకృప స్పోర్ట్స్ అధ్యక్షులు కేవీఎం ప్రకాష్, ప్రధాన కార్యదర్శి కరెంగుల రామయ్య తదితరులు పాల్గొన్నారు.
