ఫిలింనగర్‌లో స్వాతంత్య్ర వేడుకలు

జాతీయ జెండాను ఆవిష్కరించిన టీడీపీ నాయకుడు ఎం. నర్సింలు
వేడుకల్లో పాల్గొన్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలోని ఖైరతాబాద్‌ నియోజకవర్గం జూబ్లీహిల్స్‌ డివిజన్‌ ఫిలింనగర్‌లోని జానీ జైల్‌సింగ్‌ నగర్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ జూబ్లీహిల్స్‌ డివిజన్‌ కార్పొరేటర్‌ అభ్యర్థి ఎం. నర్సింలు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు పి. యాదగిరి, ఏ. గోవింద్‌, ఆటో సలీం, బి. మల్లేష్‌, ఎం. సాయి కుమార్‌, సాయి, అరవింద్‌, నాగరాజ్‌, రాములు, వెంకటేష్‌, రవి తదితరులు పాల్గొన్నారు.