రేగొండలో భట్టు కరుణాకర్‌కు జన్మదిన శుభాకాంక్షలు
రేగొండ, ఆంధ్రప్రభ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భట్టు కరుణాకర్ జన్మదినం సందర్భంగా రేగొండ కాంగ్రెస్ యూత్ నాయకులు ఆయన కార్యాలయంలో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి రేగొండ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కోయిల క్రాంతి, రేగొండ మండల యువజన కాంగ్రెస్ నాయకులు పున్నం ప్రవీణ్, రంగయ్యపల్లి గ్రామ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోమ్రాజు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
