ఉత్తమ అధికారిగా ఏఈఈ బాషీపాక భరత్‌కు అవార్డు
జనగామ, ఆంధ్రప్రభ : జనగామ మండల పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) బాషీపాక భరత్ ఉత్తమ అధికారిగా అవార్డు అందుకున్నారు. శనివారం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జనగామ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన వేడుకల్లో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య చేతుల మీదుగా ఆయన అవార్డును అందుకున్నారు. విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచి ఉత్తమ అధికారిగా గుర్తింపు పొందిన భరత్‌ను పలువురు అధికారులు, సిబ్బంది అభినందించారు.
