ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహం
లక్ష్మణచాంద, ఆంధ్రప్రభ : మండల కేంద్రానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు రాజారెడ్డి ప్రతి సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని పదో తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా గత ఏడాది పదో తరగతి ఫలితాల్లో అత్యంత ప్రతిభ కనబరిచి ఐఐఐటీ సీటు సాధించిన అనీష్‌తో పాటు కీర్తన, గణేష్, చరణ్‌లకు శనివారం రూ.20 వేల నగదు ప్రోత్సాహక బహుమతిని అందించారు.
ఈ సందర్భంగా విశ్రాంత ఉపాధ్యాయుడు రాజారెడ్డి దాతృత్వాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఇన్‌చార్జి ఎంఈఓ రాజునాయక్, మండలవాసులు అభినందించి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు, దేశభక్తి గీతాలకు నృత్యాలు ప్రదర్శించి అలరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, గ్రామ పెద్దలు, యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
