స్వాతంత్య్ర దినోత్సవం రోజు చిల్లర మాటలా?.. హరీశ్‌రావు ఫైర్

సిద్దిపేట, ఆంధ్రప్రభ : సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందిస్తూ తీవ్ర విమర్శలు చేశారు.

“ఆనాడు 420 హామీలు.. ఈనాడు 420 మాటలు” అంటూ హరీశ్‌రావు విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి జిల్లాకు వచ్చి రూపాయి నిధులైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ మాటలపై మాట్లాడాల్సి రావడం బాధాకరంగా ఉందని అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజు కూడా చిల్లర మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. సంగారెడ్డి, జహీరాబాద్ ప్రాంతాల ప్రజలు సాగునీటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని హరీశ్‌రావు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు.