వెలువర్తిలో మహా రక్తదాన శిబిరం..

వలిగొండ, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వెలువర్తి గ్రామంలో వెలువర్తి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం మహా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి ముఖ్య అతిథులుగా రామన్నపేట సీఐ రవి, ఎంపీడీవో జలంధర్ రెడ్డి, ఎస్సై శ్రీకాంత్ రెడ్డి హాజరై శిబిరాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెలువర్తి గ్రామంలో మహా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన యూత్ అసోసియేషన్ సభ్యులను అభినందించారు. మరొకరి ప్రాణాలను కాపాడేందుకు రక్తదానం చేసిన 32 మంది రక్తదాతలకు కృతజ్ఞతలు తెలిపారు.

యువత చెడు మార్గాల వైపు వెళ్లకుండా సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలను నిర్వహిస్తూ భావితరాలకు ఆదర్శంగా నిలవాలని సూచించారు.రక్తదాన శిబిరంలో యాదాద్రి తలసేమియా బ్లడ్ సెంటర్, యశోద ఆస్పత్రి వైద్యులు రక్తదాతలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ చెముడాల అనిత నర్సింగ్, ఉపసర్పంచ్ బూడిద నాగరాజు, వెలువర్తి యూత్ అసోసియేషన్ అధ్యక్షులు కూచిమల్ల సుధాకర్, మాజీ యూత్ అధ్యక్షులు ఎడవల్లి నరసింహ, తుమ్మల వెంకటరెడ్డి, ముద్దసాని కిరణ్ రెడ్డి, కేర్చిపల్లి సర్పంచ్ మద్దెల మంజుల, కలుకూరి రాములు, కాసుల పెద్దలు, చెవ్వ వెంకటేశం, నానమాల ఉప్పలయ్య, గుండు శేఖర్, శామల కొండల్ రెడ్డి, చెవ్వ మధు, చెముడాల మల్లేష్, బూడిద రాజు తదితరులు పాల్గొన్నారు.