వారాహి మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ప్రారంభం..

మహబూబ్‌నగర్ రూరల్, ఆంధ్రప్రభ : మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని వారాహి మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని మంత్రి జూపల్లి కృష్ణారావు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు ఆస్పత్రి సిబ్బందిని అభినందించారు. వైద్య రంగానికి మరింత ప్రాధాన్యం ఇస్తూ ప్రజాసేవకు కట్టుబడి పనిచేయాలని సూచించారు. ఆస్పత్రి నిర్వాహకులు డాక్టర్ రిషికేష్ రెడ్డి మాట్లాడుతూ.. తక్కువ ధరలకు నాణ్యమైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో అన్ని రకాల సదుపాయాలు, ఆధునిక వైద్య పరికరాలతో ఆస్పత్రిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పాలమూరు ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే తన లక్ష్యమన్నారు. తాను పాలమూరు బిడ్డనని, స్థానిక ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తూ సేవ చేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే జీఎంఆర్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, మూఢా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.