AP | టిడిపికి అశోక్ గజపతి రాజు రాజీనామా

విశాఖపట్నం – గోవా గవర్నర్‌గా (Goa governor ) అశోక్ గజపతిరాజు (Ashok gajapathi raju ) నియమితులైన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ(telugudesam party) సభ్యత్వానికి, పోలిట్ బ్యూరో సభ్యత్వానికి ఆయన రాజీనామా (resign ) చేశారు. అనంతరం అధికారికంగా టీడీపీ హై కమాండ్‌కి ఈ లేఖను పంపించారు. ఈ సందర్భంగా అశోక్ గజపతిరాజు భావోద్వేగానికి గురయ్యారు. పార్టీని వీడుతున్నందుకు బాధగా ఉందని, ఇన్నేళ్లు పార్టీలో ఉన్నానని ఉద్ఘాటించారు. పార్టీతో, నేతలతో ఉన్న మధుర క్షణాలని ఆయన గుర్తుకు తెచ్చుకున్నారు. చంద్రబాబు అన్ని విధాలుగా తనకు న్యాయం చేశారని చెప్పుకొచ్చారు. పసుపు శుభసూచకమని, పసుపుని నమ్ముకున్న వారు ఎవరైనా బాగుంటారని తెలిపారు. తాను ఇన్నేళ్లు ఇలా ఉన్నానంటే కారణం ఈ భగవంతుడేనని అశోక్ గజపతిరాజు పేర్కొన్నారు.
కాగా, సింహాచలం అప్పన్న స్వామిని కుటుంబ సమేతంగా అయన దర్శించుకున్నారు. ఆయనకు పూర్ణకుంభంతో అర్చక స్వాములు, ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. ఆలయం వద్ద అశోక్ గజపతిరాజును శాలువాతో మాజీమంత్రి అవంతి శ్రీనివాస్ సత్కరించారు. ఈ సందర్భంగా పార్టీకి అశోక్ గజపతిరాజు ఎంతగానో సేవలు అందించారని నేతలు కొనియాడారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఎంతో కృషి చేశారని నేతలు ప్రశంసల వర్షం కురిపించారు.
