సూపర్ జీఎస్టీ పై ప్ర‌చారం

సూపర్ జీఎస్టీ పై ప్ర‌చారం

వింజమూరు, ఆంధ్రప్రభ : వింజమూరు పట్టణంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై జీఎస్టీ అధికారులు వరప్రసాద్, వింజమూరు మండల ఎంపీడీవో శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ సూపర్ గిఫ్ట్ ఇచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం ఎలక్ట్రానిక్ వస్తువులపై 28 శాతం ఉన్న జీఎస్టీలను 18 శాతానికి తగ్గించిందని, అలాగే 18 శాతం ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువులను జీఎస్టీ ని 9 శాతానికి తగ్గించి సామాన్యులకు ఊరట కలిగించిందన్నారు. ఈ కార్యక్రమంలో వారితోపాటు వింజమూరు పంచాయతీ కార్యదర్శి రామారావు, జూనియర్ అసిస్టెంట్ సురేష్, ఆడిటర్ కొండలరావు, షాపు యజమానులు అన్నపురెడ్డి సురేంద్ర, రాఘవేంద్ర, మధుసూదన్ రెడ్డి, మాధవరెడ్డి, న‌ర్సింహ్మ‌ గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply