15peopledied | లోయ‌లో ప‌డిన‌ బ‌స్సు.. 15 మంది మృతి

15peopledied | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : జమ్ముకశ్మీర్​లో ఉద్దంపూర్ జిల్లాలో సోమవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్ర‌యాణికులు ఉన్న ఓ బస్సు అదుపు త‌ప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్ర‌మాదంలో 15 మంది మృతి చెందారు. అనేక మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. అధికారులు సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకొని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌డుతున్నారు.

అధికారులు తెలిపిన వివరాలు ప్రకారం, ఉదంపూర్​ జిల్లాలోని రామ్​ నగర్​ ప్రాంతంలో కాగోర్ట్ గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఉదయం 10 గంటల సమయంలో ఒక మలుపు వద్ద బస్సు తిరుగుతుండగా కొండపై నుంచి కిందకు పడిపోయింది. సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగ్రాతులను ఆస్పత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Leave a Reply