AP | విశాఖలో మెగా డేటా సెంటర్.. సిఫి చైర్మ‌న్

వెల‌గ‌పూడి, ఆంధ్ర‌ప్రభ : టాటా సంస్థతో పాటు పలు ప్రముఖ ఐటీ కంపెనీలు విశాఖ‌ప‌ట్నంలో తమ సంస్థలను ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చాయి. ఇక తాజాగా ఏపీ మంత్రి నారా లోకేష్‌ను సిఫీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రాజు కలిశారు. ఏపీలో పెట్టుబడులకు సిఫీ చైర్మన్ సుముఖత వ్యక్తం చేశారు. విశాఖలో మెగా డేటా సెంటర్, కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఏర్పాటుపై చర్చించారు.

ఏపీలో పెట్టుబడులకు ప్రస్తుత అవకాశాలను మంత్రి లోకేష్ వివరించారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో భాగంగా ప్రభుత్వం అందిస్తున్న సేవలపై వివరణ ఇచ్చారు. నూతనంగా తీసుకువచ్చిన ఐటీ పాలసీల గురించి లోకేష్‌ ప్రస్తావించారు. దీంతో ఆయ‌న విశాఖ‌లో త‌మ సంస్థ‌ను ఏర్పాటు చేస్తామ‌ని వెల్ల‌డించారు. ద‌ర‌ఖాస్తు చేసుకున్న 15రోజుల్లో అన్ని అనుమ‌తులు మంజూరు చేస్తామ‌ని లోకేష్ సిఫి ఛైర్మ‌న్ కు భ‌రోసా ఇచ్చారు.

Leave a Reply