నూతన డీజీపీకి కొనగాల శుభాకాంక్షలు..

హైదరాబాద్, ఆంధ్రప్రభ : నూతనంగా నియమితులైన తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ అధికార ప్రతినిధి డాక్టర్ కొనగాల మహేష్ ఈ రోజు మర్యాదపూర్వకంగా కలిశారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన డీజీపీకి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పోలీస్ బాస్ గా, డీజీపీ శివధర్ రెడ్డి నేతృత్వంలో పోలీస్ శాఖ మరింత బలోపేతమై, రాష్ట్ర ప్రజలకు ఫ్రెండ్లీ పోలీస్ మరింత చేరువై మంచి పేరు సాధిస్తుందని మహేష్ ఆశాభావం వ్యక్తం చేశారు.
