WPL | డిఫెండింగ్ ఛాంపియన్‌కు శుభారంభం !

మహిళల ప్రీమియర్ లీగ్ లో డిఫెండింగ్ ఛాంపియన్‌కు శుభారంభం ద‌క్కింది. ఈరోజు వడోదర వేదికగా ప్రారంభమైన డబ్ల్యూపీఎల్ తొలి లీగ్ మ్యాచ్‌లో బెంగళూరు జట్టు గుజరాత్ జెయింట్స్‌పై విజ‌యం సాధించింది.

గుజరాత్ జట్టు నిర్దేశించిన 202 పరుగుల లక్ష్యాన్ని 18.3 ఓవర్లలో ఛేదించిన స్మృతి మందాన సేన 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.

చేజింగ్ లో టాపార్డర్ విఫలమైనప్పటికీ.. మిడిలార్డర్ బ్యాటర్లు దంచికొట్టారు. హాఫ్ సెంచరీలతో చెలరేగిన భారత ఆల్రౌండర్ రిచా ఘోష్ (27 బంతుల్ 64 నాటౌట్), ఆస్ట్రేలియా ప్లేయర్ ఎల్లీస్ పెర్రీ (34 బంతుల్ లో57) బెంగళూరు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇక కనికా అహుజా (13 బంతుల్ 30 నాటౌట్), రాఘవి బిస్త్ (27 బంతుల్ 25) పరుగులతో రాణించారు. దీంతో డబ్ల్యూపీఎల్ మూడో సీజన్ లో ఆర్సీబీకి మంచి ఆరంభం దక్కింది.

గుజరాత్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ బెత్ మూనీ (56), కెప్టెన్ ఆష్లే గార్డనర్ (79 నాటౌట్) అద్భుత ప్రదర్శన చేశారు. ఇక డియాండ్రా డాటిన్ (25), సిమ్రాన్ షేక్ (11) పరుగులతో పరువాలేదనిపించారు. దీంతో గుజరాత్ జట్టు నిర్ణీత ఓవర్లలో 201/5 పరుగులు చేసంది. ఆర్సీబీ బౌలర్లలో రేణుకా సింగ్ రెండు వికెట్లు తీయగా.. కనికా అహుజా, జార్జియా వేర్‌హామ్, ప్రేమ రావత్ తలో వికెట్ దక్కించుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *