Mothkur | ఘనంగా ఇందిరాగాంధీ జయంతి

Mothkur | ఘనంగా ఇందిరాగాంధీ జయంతి
పండ్లు, బ్రెడ్లు పంపిణీ
Mothkur | మోత్కూర్, ఆంధ్రప్రభ : మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 108వ జయంతి వేడుకలను యాదాద్రి భువనగిరి జిల్లా (Yadadri Bhuvanagiri district) మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో బుధవారం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుండగొని రామచంద్రు గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈసందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమక్షంలో ఇందిరమ్మ (Indiramma) చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు, గర్భిణీలకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఇందిరాగాంధీ ఆశయాల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు పురుగుల నర్సింహా, ఉయ్యాల అంజయ్య, మందుల సురేష్, కోమటి మచ్చగిరి, పి శేఖరా చారి, బొమ్మగాని ఉప్పలయ్య, తదితరులు పాల్గొన్నారు.
