Dog Squad | క్షుణ్ణంగా తనిఖీలు…

Dog Squad | క్షుణ్ణంగా తనిఖీలు…
Dog Squad | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలంగాణ హైకోర్టుకు మరోసారి బాంబు బెదిరింపు మెయిల్ కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి హైకోర్టును పేల్చివేస్తామనే బెదిరింపు మెయిల్ అందడంతో న్యాయవాదులు, సిబ్బంది, న్యాయమూర్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు బాంబు డిస్పోజల్ స్క్వాడ్ (BDS), డాగ్ స్క్వాడ్‌తో హుటాహుటిన హైకోర్టు ప్రాంగణానికి చేరుకున్నారు. కోర్టు హాళ్లు, న్యాయమూర్తుల ఛాంబర్లు, రిజిస్ట్రీ కార్యాలయాలు, పార్కింగ్ ఏరియాలతో పాటు ప్రతి అనుమానాస్పద వస్తువును క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా కోర్టు సిబ్బంది, న్యాయవాదులను బయటకు తరలించారు. తనిఖీలు పూర్తయ్యే వరకు ఎవరూ లోపలికి రావొద్దని సూచించారు. పరిసర ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేసి, అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉన్నారు.
