BombThreat | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో హై అలర్ట్
BombThreat | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో హై అలర్ట్
BombThreat | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: ఫ్రాంక్‌ఫర్ట్ నుంచి హైదరాబాద్‌లోని శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వస్తున్న లుఫ్తాన్సా విమానానికి బాంబు బెదిరింపు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. విమానంలో బాంబు ఉన్నట్లు గుర్తుతెలియని వ్యక్తి ఈ-మెయిల్ ద్వారా హెచ్చరించినట్లు సమాచారం.
విమానం శంషాబాద్‌లో ల్యాండ్ అయ్యేలోపు పేలుతుందని బెదిరింపు మెయిల్‌లో పేర్కొన్నట్లు తెలిసింది. దీంతో విమానాశ్రయ భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై చర్యలు చేపట్టారు. విమానం ల్యాండ్ అయిన అనంతరం అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అలాగే విమానాశ్రయ పరిసర ప్రాంతాల్లో కూడా భద్రతా తనిఖీలు కొనసాగుతున్నాయి. ఘటనపై సంబంధిత అధికారులు దర్యాప్తు చేపట్టగా, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
