Kedarnath Yatra | వాన‌లు కురుస్తుండ‌టంతో తాత్కాలిక నిలిపివేత‌

Kedarnath Yatra | వాన‌లు కురుస్తుండ‌టంతో తాత్కాలిక నిలిపివేత‌

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదాల నేపథ్యంలో కేదార్‌నాథ్, బద్రీనాథ్ యాత్రలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం. హిమాలయ ప్రాంతంలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. వాతావరణ శాఖ జారీ చేసిన రెడ్, ఆరెంజ్ అలర్ట్ నేపథ్యంలో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది.

కేదార్‌నాథ్ యాత్ర మార్గంలో కొండచరియలు విరిగిపడటం వల్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అలాగే బ‌ద్రినాథ్ మార్గంలో కూడా వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా మారాయి. దీంతో భక్తులను ముందస్తు జాగ్రత్తగా సోన్‌ప్రయాగ్, గౌరీకుండ్ ప్రాంతాల్లో నిలిపివేసినట్లు సమాచారం. ప్రతికూల వాతావరణం కారణంగా హెలికాప్టర్ సేవలను కూడా తాత్కాలికంగా నిలిపివేశారు. యాత్రా మార్గాల్లో భద్రతా పరిస్థితులు పూర్తిగా సాధారణమయ్యే వరకు ప్రయాణాలను నిలిపివేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. విపత్తు నిర్వహణ బృందాలు మరియు స్థానిక అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తూ సహాయక చర్యలు చేపడుతున్నారు. భక్తులు సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని, అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

Leave a Reply